తిరుమలగిరుల్లో చేతికందుతున్న మేఘాలు! - thirumala weather news
మేఘాలు చేతికందితే.... ఈ ఊహ కాస్త అత్యాశే అనుకుంటాం కదా! మేఘాలు మన కళ్లెదురుగా నిలబడి ఫోటోలకు ఫోజులిస్తే... గాల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది కదా! ఇలాంటి అరుదైన దృశ్యమే ఆవిష్కృతమైంది తిరుమల సప్తగిరుల్లో! కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో.... పచ్చని చెట్లు, మంచు పొరలతో మరింత సుందరంగా మారిన ఇక్కడి ప్రకృతి రమణీయత.. సినిమాల్లోని గ్రాఫిక్స్కు ఏ మాత్రం తీసిపోవట్లేదు. రెండో కనుమదారిలో కనిపించిన ఈ మేఘాలు.... మోమును ముద్దాడుతున్నాయా అనిపించేలా మైమరిపిస్తున్నాయి. పాల నురగలా దట్టంగా దర్శనమిస్తూ.... దర్శనానికి వెళ్తున్న భక్తలు దారిలోనే విశ్రమించి ఆస్వాదించేలా చేశాయి.