'అమరావతి వీరుడా' పాటను రైతులకు అంకితమిచ్చిన అశ్వినీదత్ - 'అమరావతి వీరుడా' పాటను విడుదల చేసిన సినీనిర్మాత అశ్వినీదత్
ఉద్యమానికి అనుగుణంగా రూపొందించిన 'అమరావతి వీరుడా' పాటను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ రైతులకు అంకితమిచ్చారు. జగన్ పార్టీ పేరులో రైతు అనే పదాన్ని పెట్టుకొని రైతుల పట్ల కఠినంగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధి పథకాలను రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని గుర్తు చేశారు. రైతు కన్నీరు కారిస్తే అది రాష్ట్రానికి మంచిది కాదని జగన్ గ్రహించాలన్నారు.