ప్రతిధ్వని: పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ ఉందా ? లేదా ? - debate on woman protection
సమాజంలో సగ భాగమైన స్త్రీలు నిత్యం వేధింపులతో నలిగిపోతున్నారు. ఆర్థిక స్వావలంభన కోసమో.. ఆత్మగౌరవం కోసమో గడప దాటి బయటకు అడుగు పెడుతున్న మహిళలకు అడుగడుగునా అవరోధాలే. సూదుల్లా గుచ్చుకునే చూపులు, వెకిలి నవ్వులు, సూటిపోటి మాటల దాడిలో ఆమె నిలువెల్లా గాయపడుతోంది. చట్టాల రక్షణ, వ్యవస్థల చట్రాలు చట్టుబండులవుతున్న చోట ఆమె.. నిస్సహాయ స్థితిలో అలసిపోతోంది. అవమాన భారంతో కుంగిపోతోంది. ఈ పరిస్థితి మారెదెలా ? చట్టబద్ధ వ్యవస్థలు, పౌర సమాజం బాధ్యతలు ఏంటి ? అనే అంశపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.