కర్నూలు జిల్లా డోన్‌లో పంపిణీకి నోచుకోని ఆదరణ సైకిళ్లు - ycp govt negligence on Adarana Scheme
గత ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద దాదాపు రెండు వందల సైకిళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేపట్టేలోపు ఎన్నికల కోడ్ రావడం వల్ల కర్నూలు జిల్లా డోన్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉంచారు. అయితే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటి పంపిణీని మరిచింది. ఫలితంగా వీటిపై మొక్కలు, గడ్డి పెరగడం వల్ల తుప్పు పట్టాయి.