ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అనగనగా ఓ ఇల్లు.. ఆ ఇంట్లో ముడున్నర అడుగుల తేనెతుట్టె - beehive at home in Mulugu

By

Published : Sep 19, 2022, 4:21 PM IST

Updated : Sep 19, 2022, 4:50 PM IST

beehive at home in Mulugu : తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా రాజపేట గ్రామంలోని ఓ ఇంట్లో తేనెతుట్టె పెట్టింది. సాధారణంగా తేనెతుట్టెలు అడవుల్లోనూ, ఎత్తైన చెట్లకు, కొండలకు కనిపిస్తుంటాయి. కానీ ఇంట్లోనే పెట్టిన మూడున్నర అడుగుల పొడవాటి తేనెతుట్టే స్థానికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏడాది క్రితం హాల్లో ఓ మూలకు చిన్నగా మొదలై క్రమంగా స్తంభాకారంలో భారీగా పెరుగుతూ వస్తుంది. ఇంట్లో ఇప్పటివరకు ఎవరిని తేనెటీగలు కుట్టలేదని.. అందుకే తుట్టెను తొలగించే ప్రయత్నం చేయలేదని ఇంటి యజమాని సూరిబాబు తెలిపారు. చుట్టుపక్కల పూల మొక్కలు ఉండటంతో తేనెటీగలు వదిలి వెళ్లడం లేదని ఆయన అన్నారు.
Last Updated : Sep 19, 2022, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details