వైభవంగా శ్రీవారి తెప్పోత్సవం - tirupathi latest news
🎬 Watch Now: Feature Video
శ్రీనివాసుని తెప్పోత్సవాల నాల్గవరోజు వేడుక.. తిరుమలలో వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీవారి ఆలయం నుంచి అమ్మవార్లతో కలసి తిరుచ్చి వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ పుష్కరిణికి చేరుకున్నారు. అనంతరం కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ భూదేవీ సమేతంగా ఆశీనులైన స్వామివారు ఐదుసార్లు ప్రదక్షిణంగా విహరించారు. విశేష తిరువాభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో అలంకార భూషితులైన ఉత్సవమూర్తులను వేలాది భక్తులు దర్శించుకున్నారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తిసంకీర్తనలమద్య... తెప్పోత్సవం వైభవంగా సాగింది.