Prathidwani : నాలాపన్ను భారం నుంచి ఊరట లభించే అవకాశాలు ఉన్నాయా? లేదా?
రాష్ట్రంలో మరోసారి పన్నులమోత కలవర పెడుతోంది. పేదలపై నాలాపన్ను పిడుగు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎప్పుడో భూమార్పిడి జరిగిన భూములకు ఇప్పుడు భారీ మొత్తంలో పన్నులు చెల్లించాలన్న అధికారుల తాఖీదులతో సంబంధిత వర్గాలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఖజనా నింపుకోవడమే అయినా.. అది పేద, మధ్యతరగతికి మోయలేని భారంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు? నాలాపన్ను భారం నుంచి ఊరట లభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST