prathidwani: ప్రస్తుత జీవన విధానంలో.. నిద్రకు భంగం కలిగించే అలవాట్లను ఎలా మానుకోవాలి..?
కాలంతో పోటీపడి ముందుకుసాగుతున్న ఉరుకులు, పరుగుల జీవితంలో సగటు మనిషికి కంటినిండా కునుకే కరువైంది. సెల్‌ఫోన్, సోషల్ మీడియా రూపంలో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా మనిషి ప్రశాంతంగా నిద్రపోలేని ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి విరుద్ధంగా అపసవ్య జీవనశైలికి బానిసలవుతున్నవారు నిద్రకు దూరమవుతున్నారు. ఫలితంగా సగటు ఆరోగ్యవంతులు కూడా వ్యాధుల సుడిగుండంలో చిక్కుతున్నారు. అసలు సగటు ఆరోగ్యవంతులు ఎంతసేపు నిద్రపోవాలి? నిద్రాభంగం కలిగించే అలవాట్లను ఎలా వదిలించుకోవాలి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST