MP Madhavi Video: వరి కుప్ప నూర్పులో.. బిజీబిజీగా ఎంపీ మాధవి దంపతులు - ఏపీ వార్తలు
ఆమె ఓ ఎంపీ..! నియోజకవర్గంతో పాటు రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ వేదికగా గళాన్ని వినిపించే ప్రతినిధి! అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే.. అధికారుల హడావిడి, స్థానిక పోలీసుల బందోబస్తు సర్వసాధారణమే! కానీ.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రూటే సెపరేటు! ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన ఆ ఎంపీ దంపతులు.. తాము నమ్ముకున్న వ్యవసాయాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు! ఎంపీగా ఓ వైపు బిజీగా ఉంటూనే.. సమయం దొరికిన వేళల్లో వ్యవసాయం పనుల్లో నిమగ్నమైపోతున్నారు. తాజాగా.. వారి స్వగ్రామమైన పాడేరు పరిధిలోని శరభన్నపాలెంలో వరినూర్పు పనిలో బిజీబిజీగా కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.