ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: కొవిడ్‌ రెండో వేవ్‌లో యువతపై కరోనా తీవ్రప్రభావం

By

Published : May 26, 2021, 9:27 PM IST

మాకేం అవుతుందిలే అన్న అతి విశ్వాసం. అలా బయటకు వెళ్లినంత మాత్రాన వైరస్ వచ్చేస్తుందా అన్న అలసత్వం. పాజిటివ్ వస్తే ఏం చేయాలో మాకు తెలుసులే అని అతి తెలివి తేటలు. నిబంధనలు మాకు కాదు అనే పట్టని ధోరణులు. ఇవన్నీ వెరసి ఇప్పుడు కరోనా బాధితుల్లో యువత వాటాను అమాంతం పెంచేస్తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌లో యువతరం భారీ సంఖ్యలో వైరస్‌ కోరల్లో చిక్కుకున్నారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎంత చెప్పినా.. ఎన్ని సూచనలు అందిస్తున్నా వారి తీరులో మార్పు రావటం లేదు. లాక్‌డౌన్‌, ఆంక్షల మధ్య రోడ్లపై ఖాకీలకు చిక్కుతున్న కుర్రాళ్లే అందుకు ఓ నిదర్శనం. ఈ సంక్షోభ సమయంలో యువతలో ధోరణులను ఎలా చూడాలి. వారి తీరు మార్చే మార్గాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details