PRATIDWANI:కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈయూఎల్ - who approval to covaxin
కరోనా కట్టడిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ టీకా కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి జారీచేసింది. ఇప్పటికే అనేక దేశాల్లో వైద్య నిపుణుల మన్నన పొందిన కోవాగ్జిన్... ఇకపై నిరభ్యంతరంగా వైద్య ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్ల కట్టడిలో కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తోంది. భారత్ బయోటెక్ అందించిన కోవాగ్జిన్ ఫార్మూలాను ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ టీకా అభివృద్ధి క్రమం, వైరస్ నియంత్రణలో టీకా సామర్థ్యం, కరోనా నియంత్రణలో లభించే భరోసాపై ఈరోజు ప్రతిధ్వని.