కుయ్.. కుయ్.. శబ్ధాలతో మార్మోగిన విజయవాడ - ఏపీలో నూతన 108, 104 వాహనాలు
ఆపత్కాలంలో ప్రథమ చికిత్స అందించే 104తో పాటు 108 అంబులెన్స్‌లు అధునాతన సదుపాయాలతో సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 104, 108 వాహనాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రూ.201 కోట్లతో 1068 కొత్త వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.