కోలాహలంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం వైకుంఠపురంలో శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు స్వామివారికి గరుడోత్సవం నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. పెద్దఎత్తున భక్తులు హాజరై దర్శించుకున్నారు.