మంత్రాలయంలో ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు - Tungabhadra pushkaralu start in mantralam Kurnool latest news
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు పుష్కరాలను ప్రారంభించారు. మఠం నుంచి నది వరకు ఊరేగింపుగా వచ్చి పీఠాధిపతి.... తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి పుష్కర స్నానం చేసి గంగ హారతి ఇచ్చారు. పుష్కరాల్లో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.