మన్యంలో జలపాతాల సోయగాలు...పర్యాటకుల సందడి
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి పర్యాటక అందాలను ఆదివారం పెద్ద సంఖ్యలో వీక్షించారు. రంపచోడవరం మండలం సీతపల్లి వాగు వద్ద పర్యాటకులు ఉల్లాసంగా గడిపారు. అలాగే మారేడుమిల్లిలోని అమృతధార, జలతరంగిణి వద్ద ఉన్న జలపాతాల్లో పర్యాటకులు కేరింతలు కొట్టారు.