ప్రతిధ్వని: తెలుగు సినిమాకు గానపథం...పాటకు ప్రాణ పథం ! - ఈరోజు ప్రతిధ్వని న్యూస్
పాట ఆగింది. దశాబ్దాలు ఆ గానంతో అలరించిన ఆ గళం మూగబోయింది. దివికేగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానిది సినీ నేపథ్య గానంతో అయిదు దశబ్దాల రాగబంధం. ఆయన తెలుగు వారి హృదయ గానం. నిత్య వసంత హృదయ గానం. 16 భాషాల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు సినిమాకు గానపథంగా...పాటకు ప్రాణ పథంగా నిలిచారు. ఇంటి పేరు శ్రీపతి పండితారాధ్యులైనా...ఆయన పండితులనే కాదు.., పామరులను కూడా అలరించారు. చిత్రసీమకు పాటనే కాదు మాటను కూడా ఇచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎవరికి పాడితే వారిని ఆవహించినట్లు పాడే అసమాన ప్రతిభ ఆయన సొంతం. అర్ధ శతాబ్దంగా తన గానవాహినితో ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి ఘన నివాళిగా ప్రతిధ్వని కార్యక్రమాన్ని చేపట్టింది.