TTD brahmotsavam 2021: పెదశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారు పెదశేషవాహన వాహనంపై ఊరేగారు. ఏడుపడగల ఆదిశేషుడిపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తిరుమల ఆలయంలోని కల్యాణమండపంలో వాహనసేవ నిర్వహించారు.