ముగిసిన పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు - తిరుచానూరు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో అఖరి రోజున అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మావతి అమ్మవారు తెప్పలపై పద్మసరోవరంలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తెప్పలపై విహరిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.