రెండో రోజూ వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవం - Thiruchanur Sri Padmavati devi latest updates
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు రెండో రోజూ వైభవంగా కొనసాగాయి. కరోనా ప్రభావంతో ఆలయంలోనే ఏకాంతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న తితిదే.. బంగారు రథం బదులు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారిని ఊరేగించారు.