తిరుమల బ్రహ్మోత్సవాలు: వైభవంగా శ్రీవారి చక్రస్నానం - Tirumala Tirupati Devasthanam latest updates
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన చక్రస్నాన వేడుక కార్యక్రమం వేడుకగా సాగింది. ఈ వేకువజామున సన్నిధి నుంచి ఉత్సవమూర్తులను కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అక్కడ శ్రీదేవీ, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం, అభిషేకాదులను నిర్వహించారు. దూప ధీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి సుదర్శన చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించారు. కరోనా నిబంధనలతో ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే చక్రస్నానం నిర్వహించేందుకు అయిన మహల్ వద్ద తొట్టెను నిర్మించి... చక్రస్నానం కార్యక్రమాన్ని ఆలయంలోనే నిర్వహించారు.
Last Updated : Sep 27, 2020, 11:28 AM IST