మంచు కురిసే వేళలో... కోనసీమ అందాలు - కోనసీమ ప్రకృతి
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలు, కేంద్రపాలిత ప్రాంతం యానాంను మంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్న మనిషి కనిపించనంతగా మంచు కురుస్తోంది. పూలచెట్లు కొత్త అందాలతో కనువిందు చేస్తున్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు లైట్ల వెలుగులోనే తక్కువ వేగంతో ప్రయాణం సాగించాయి. మంచుతో గోదావరిలో దారి కనపడక మత్స్యకారులు సూర్యోదయం అయ్యేంతవరకు గట్టున వేచి చూశారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండగా... యువత సెల్ఫీలు దిగారు.