రాశి ఫలం: సింహం - undefined
ఆదాయం: 14, వ్యయం: 2, రాజపూజ్యం: 1, అవమానం: 7 సింహరాశి వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం విదేశీయాన ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాట పట్టింపు, మెుండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. రూపాయి ఖర్చయ్యే చోట వంద రూపాయలు ఖర్చవుతాయి. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదం, పందేలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంది. వివాహశుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
TAGGED:
simha rashi