Siberian Birds: విదేశీ విహంగం.. స్వేచ్ఛా విహారం! - Serbian birds at ananthapur
విదేశీ విహంగాలు రెక్కలు కట్టుకుని అనంతపురం గడ్డపై వాలిపోయాయి. అనంతపురం జిల్లా గుడిబండ మండల కేంద్రం చెరువులో సైబీరియన్ పక్షులు.. సందడి చేస్తున్నాయి. సైబీరియన్ పక్షులు గుంపులు గుంపులుగా చేరి అక్కడి ప్రజల్లో ఆనందం నింపుతున్నాయి. ఆహారం కోసం ఈ పక్షులు ఖండాలు దాటుకొని వలసలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో గుడిబండ చెరువు వద్ద విహరిస్తున్నాయి. చెరువులో నీరు అడుగంటడంతో చేపలను తింటూ.. వారం రోజులుగా ఇక్కడే మకాం వేశాయి. ప్రజలు ఈ పక్షలును ఆసక్తిగా తిలకిస్తున్నారు. తమ ప్రాంతంలో ఈ పక్షులను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.