కాంతులీనుతున్న సచివాలయం..గణతంత్ర వేడుకలకు ముస్తాబు - కాంతులీనుతున్న సచివాలయం వార్తలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వివిధ రంగుల విద్యుత్ దీపాలతో సచివాలయంలోని ఐదు బ్లాక్లనూ అలంకరణ చేశారు. మువ్వన్నెల జెండాల రంగులతో కూడిన విద్యుత్ దీపకాంతులతో సచివాలయం నూతన శోభను సంతరించుకుంది. ఇదే ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర శాసనసభ, మండలి భవనాలను సైతం విద్యుత్ దీపాలతో అలంకరించారు.