కరోనా టీకాపై అవగాహన.. కళాకారుడి శాండ్ ఆర్ట్
కొవిడ్ మహమ్మూరి ప్రభలుతున్న వేళ టీకా వేయించుకోవడంపై అపోహలు వీడి అందరూ ముందుకు రావాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే బ్యాంకు ఉద్యోగి శాండ్ ఆర్ట్ రూపొందించారు. రోజురోజుకీ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్యులు, వైద్య సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగిందని.. మన వంతు బాధ్యతగా మాస్కు ధరించటం, టీకా వేయించుకోవటం ద్వారా వైరస్ను కట్టడి చేయాలని వీడియో ద్వారా అవగాహన కల్పించారు. కరోనాతో ముందు వరుసలో పోరాడుతున్న వివిధ విభాగాల వారికి తన కళ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.