రాశిఫలం: ధనుస్సు - dhanu rasi
ఆదాయం:08, వ్యయం: 11 రాజ్యపూజ్యం: 06, అవమానం: 03 ఈ రాశివారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రతి విషయంలో స్త్రీల సహకార, సలహాలు లాభిస్తాయి. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో విమర్శించిన వాళ్లంతా మీ కీర్తిని ప్రశంసిస్తారు. అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాదన చేయండి. శత్రువుల వల్ల ఇబ్బందులు వచ్చినా మీరే పైచేయి సాధిస్తారు.