కృష్ణమ్మ పరవళ్లకు నవ హారతులు - విజయవాడ లేటెస్ట్ న్యూస్
విజయవాడ దుర్గాఘాట్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. పరవళ్లు తొక్కుతున్న కృష్ణవేణి తరంగాలు... ప్రదోషకాలంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య నదీమాతకు నవహారతులతో కృష్ణానది మిరమిట్లు గొలుపుతోంది. దుర్గాఘాట్ ఒడ్డున ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై రుత్వికులు కృష్ణమ్మకు ఓంకార హారతి, నాగహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహవారధి, కుంభహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. బాలచాముండికా అమరేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు నవహారతులు పట్టారు. ఆరు నెలల తర్వాత మొదలైన కృష్ణాహారతి...ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు కొనసాగుతుందని దుర్గగుడి ఈవో సురేష్‌బాబు తెలిపారు.