ప్రతిధ్వని: దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు సాధ్యమేనా..?
ఒకే దేశం, ఒకే ఎన్నిక కేవలం చర్చనీయాంశం కాదు. దేశానికి అత్యవసరం. దేశంలో ప్రతినెల ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రభావం అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఒకే దేశం, ఒకే ఎన్నికపై లోతైన అధ్యయనం జరగాలని స్పీకర్ల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందుకోసం తొలుత లోక్సభ, విధానసభ, పంచాయతీ ఎన్నికలకు పనికొచ్చేలా..ఒకే ఓటరు జాబితా రూపొందించాలని స్పీకర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.