PRATIDWANI: సఫాయి కార్మికుల ప్రాణాలకు రక్షణ ఎలా..?
మానవ వ్యర్థాలను, మురుగు కాలువల్లో అశుద్ధాలను శుద్ధి చేసే సిపాయిలు.. సఫాయి కర్మచారులు. మోరీల్లో దుర్గంధాన్ని భరిస్తూ డ్రైనేజీల ప్రవాహం సాఫీగా సాగేందుకు ప్రాణాలు పణంగా పెడుతున్న శ్రామికులు వీళ్లు. అత్యంత ప్రమాదకరమైన, అమానవీయమైన ఈ వృత్తిని ప్రభుత్వం నిషేధించింది. మనుషులకు బదులుగా యంత్రాలతోనే డ్రైనేజీలు శుద్ధి చేయాలని స్పష్టం చేసింది. కానీ.. సఫాయి కార్మికులు మోరీల్లోకి, భూగర్భ డ్రైనేజీల్లోకి దిగి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. బతుకుదెరువు కోసం డ్రైనేజీ మలినాల్లో మునిగి తేలుతున్నసఫాయి కార్మికుల కష్టాలు తీరెదెప్పుడు? మురుగునీటి కాలువల్లో ఊపిరాడక మరణిస్తున్న కార్మికుల ప్రాణాలకు రక్షణ ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని...