PRATIDWANI: ర్యాష్ డ్రైవింగ్‌కు బ్రేకులు వేసేదెలా? వాహన వేగానికి కళ్లెం వేసేదెలా? - రహదారులు ప్రమాద రహితం కావాలంటే ఏం చేయాలి?
అతివేగం అనర్థదాయకం... వేగం కన్న ప్రాణం మిన్న. ఈ హితోక్తులు చెవికెక్కించుకోని వాహనచోదకులు రోడ్డు ప్రమాదాల్లో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వంటి మితిమీరిన చర్యలతో జీవితంలో చేజేతులా విషాదం నింపుకుంటున్నారు. శృతిమించిన వేగంతో వాహనాలు నడుపుతున్న వ్యక్తుల వల్ల పాదచారులు, సైక్లిస్టుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతోంది. పట్టణాలు, నగరాల రోడ్లపై హద్దులు దాటుతున్న వాహన వేగానికి కళ్లెం వేసేది ఎలా? రద్దీకి అనుగుణంగా రోడ్ల నాణ్యతను పరిరక్షించడం ఎలా? వాహన చోదకులు సురక్షిత డ్రైవింగ్‌కు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.