Pratidwani: ఒమిక్రాన్ ఎలా విస్తరిస్తోంది.. అనుసరించాల్సిన విధానమేంటి..? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
Omicron Variant: ఒమిక్రాన్ పుట్టుకతో ప్రపంచానికి కొవిడ్ వైరస్ ప్రమాదం పెరిగిందా లేక దాని తీవ్రత తగ్గిందా..? విశృంఖల ఉత్పరివర్తనాల పరిణామక్రమం వైరస్‌ను బలహీనం చేస్తోందా లేక మరింత దృఢంగా మారుస్తోందా? కరోనా కొత్త వేవ్ తరుముకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు శాస్త్రవేత్తల నుంచి సామాన్యుల వరకు అందరి ఆలోచనల్ని తొలిచేస్తున్న చిక్కుప్రశ్న ఇది. దేశానికో తీరుగా, ప్రాంతానికో రకంగా వైరస్‌లు కూడా రూపాలు మార్చుకుంటాయా? వ్యాక్సినేషన్ గోడలూ, హెర్డ్ ఇమ్యూనిటీ కవచాలూ దాటుకుని ఒమిక్రాన్ ఎలా విస్తరిస్తోంది? అనివార్యంగా కరోనా కొత్త అల ముంచుకొస్తే అనుసరించాల్సిన ఆపత్కాల విధానమేంటి? ఇదే అంశంపై ఈ రోజుప్రతిధ్వని.