కుటుంబాల్లో మద్యం చిచ్చు.. కట్టడిలో ప్రభుత్వాల బాధ్యత ఎంత..? - ఏపీ తాజా వార్తలు
Liquor Prohibition: ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన మద్యం అమ్మకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. మద్యం వ్యసనపరులు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుంతా తాగుడుకే ఖర్చు చేస్తున్నారు. ఇల్లు గడిచేందుకు చేతిలో డబ్బుల్లేని స్థితిలో మహిళలపై హింస పెరుగుతోంది. ఇంకోవైపు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కళ్లముందే ఇన్ని ఘోరాలు జరుగుతున్నా.. ఈ అనర్థాలకు కారణమవుతున్న మద్యం కట్టడిలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ పరిస్థితి మారేదెలా ? ఇదే అంశంపై ఈరోజు "ప్రతిధ్వని".