Pratidhwani: భారత శిక్షాస్మృతిలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందా ? - ప్రతిధ్వని కార్యక్రమం
Pratidwani: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న క్రిమినల్ జస్టిస్ సిస్టం సమూల ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. నేరాల నమోదు, సాక్ష్యుల విచారణ, శిక్షల ఖరారుకు దిశానిర్దేశం చేస్తున్న చట్టాల్లో కాలం చెల్లిన అంశాలను సంస్కరించేందుకు ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో భారత శిక్షాస్మృతిలో మార్పులపై గతంలో ఏర్పాటు చేసిన కమిషన్లు ఎలాంటి సిఫారసులు చేశాయి? రణబీర్ సింగ్ కమిటీ సంప్రదింపులతో సాధించిన ప్రగతి ఏంటి? బ్రిటిష్ కాలంలో రూపొందిన శిక్షాస్మృతికి ఇప్పుడు ఎలాంటి సంస్కరణలు అవసరం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.