ప్రతిధ్వని: ఒకే దేశం.. ఒకే మార్కెట్‌పై చర్చ
ఒకే దేశం - ఒకే వ్యవసాయ మార్కెట్ లక్ష్యం దిశగా.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇక నుంచి రైతులు తమ పంటల్ని.. ఇష్టమైన ధరకు, నచ్చిన వారికి అమ్ముకోవడానికి.. స్వేచ్ఛ లభించనుంది. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి రైతులు కుదుర్చుకునే ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది. నిత్యావసర వస్తువుల చట్టం పరిధినుంచి చిరు ధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లి, బంగాళదుంపల్ని తొలగించి.. నిల్వల పరిమితిపై ఆంక్షలు ఎత్తివేయబోతోంది. ఈ నిర్ణయాలతో.. రైతులకు ఏ మేరకు లాభం చేకూరుతుంది? ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈ అంశాలపై ఈటీవీ ప్రతిధ్వని చర్చ.