ప్రతిధ్వని: విదేశాల్లో బడా ఆర్థిక నేరగాళ్లు.. భారత్కు రప్పించేదెప్పుడు ? - లలిత్ మోదీ
ఆర్థిక నేరగాళ్లకు భారత్ అంటే అంత అలుసా? ఇప్పుడు దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఇదే విషయం చర్చ జరుగుతోంది. 13 వేల 500 కోట్ల రూపాయల కుంభకోణంతో పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు ఉడాయించిన ఘరానా దొంగల్ని తిరిగి దేశానికి తీసుకువచ్చేది ఎప్పుడు? చిక్కినట్లే చిక్కి... చిత్రమైన ఎత్తుగడులతో అప్పగింత నుంచి తప్పించుకుంటున్న మెహుల్‌చోక్సీ దేశానికి తిరిగి వస్తాడా అసలు? తనొక్కడే కాదు... నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ... వంటి 50మందికి పైగా బడబడా ఆర్ధికనేరగాళ్లు భారత దర్యాప్తు సంస్థలతో దాగుడుమూతలు ఆట ఆడుతున్నారు. ఫలితంగా సంవత్సరాలు గడుస్తున్నా వారిని తిరిగి తెచ్చే దారి... వాళ్లు కొట్టేసిన సొమ్మును తిరిగి కక్కించే మార్గం కనిపించడం లేదు. అసలు ఎందుకీ దుస్థితి? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.