ప్రతిధ్వని: కరోనా... వ్యూహాత్మక పోరు
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. కేసుల సంఖ్య మూడు లక్షలు దాటి ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. మరోవైపు.. రికవరీ 50 శాతం దాటడం.. మరణాల సంఖ్య తక్కువగా ఉండటమే కాస్త ఉపశమనం కలిగిస్తోంది. లాక్డౌన్ సడలింపులతో తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాదు.. వైద్యులు, విలేకరులు, ప్రజా ప్రతినిధులు.. అందరూ వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో దాదాపు 45 శాతం మంది ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యాధికి గురవుతున్నారు. గమనించేలోపే కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు కరోనా వ్యాపిస్తోంది. చికిత్స అందిస్తున్న ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హోం క్వారెంటైన్లో ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ దిశగా ఎలాంటి ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలనే అంశంపై ప్రతిధ్వని చర్చ.
Last Updated : Jun 15, 2020, 11:18 PM IST