Prathidwani debate : ఎయిడెడ్ వివాదం ముగిసినట్లేనా? - government decision about aided schools
ఇక... మీ ఇష్టం..! విలీనం చేస్తారో.. ఇప్పుడు ఉన్నట్లే నడుపుకుంటారో... ఇచ్చిన సమ్మతి పత్రాలు వెనక్కి తీసుకుంటారో... మీ ఇష్టం. సిబ్బంది... ఆస్తులను అప్పగించాల్సిన అవసరం లేదు! గ్రాంట్ ఇన్ఎయిడ్ కొనసాగుతుంది! రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ఉద్రిక్తతలకు కారణమైన ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఇది. అన్ని వైపుల నుంచి వస్తోన్న వ్యతిరేకతలతో... ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా.. ఉన్నత విద్యా శాఖ ఒక మెమో కూడా జారీ చేసింది. మరి... ఇంతటితో వివాదం సద్దుమణిగినట్లేనా? అసలు.. ఎయిడెడ్ విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.