ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: దేశ సమగ్రాభివృద్దికి కరోనా కలిగించిన విఘాతం ఎంత? - కరోనా సంక్షోభం పై ప్రతిధ్వని చర్చ

By

Published : May 15, 2021, 9:07 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మన దేశంలో ఆర్థిక, సామాజిక అంతరాలను మరింత తీవ్రం చేస్తోంది. పంచవర్ష ప్రణాళికల భూమికతో, ప్రపంచీకరణ వెల్లువతో ఎదిగి వచ్చిన భారత ఆర్థిక ప్రగతి అంతా ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడుతోంది. ఒక్కో ఇటుక పేర్చినట్లు ఓర్పుతో నేర్పుగా సాధించిన అభివృద్ధి ఫలాలన్నీ కోవిడ్‌ వేవ్‌ల్లో ధ్వంసం అవుతున్నాయి. ఫలితంగా దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ పరిణామాలు సమాజంలో తీవ్ర వ్యత్యాసాలను సృష్టిస్తున్నాయి. కరోనా విజృంభించినంత కాలం రెక్కాడితే డొక్కాడని పేదజనం ఉపాధి లేక పస్తులుండాల్సిందేనా? ఉద్యోగాలు కోల్పోయి, ఆదాయాలు పడిపోయి అల్లాడుతున్న మధ్య తరగతి ఆర్థికంగా కుంగిపోవాల్సిందేనా? కరోనా సృష్టించిన ఈ సామాజిక ఆర్థిక సంక్షోభంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details