ప్రతిధ్వని: రికార్డు స్థాయి నుంచి భారీ పతనం వైపు బంగారం ధరలు - తెలంగాణ వార్తలు
పెరగటం తప్ప తగ్గటం తెలియని బంగారం కొంతకాలంగా చిన్నబోతోంది. కరోనా అనంతర పరిణామాల్లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు... ఇప్పుడు ఊహించని రీతిలో తగ్గు ముఖం పడుతున్నాయి. మూడు వారాలుగా నేలచూపులు చూస్తున్న పసిడి సూచీలు కొనుగోలు దారులకు ఆశలు రేపుతుంటే... ఇప్పటికే కొన్నవారిలో ఈ రేట్లు ఇంకెంత క్షీణిస్తాయో అని గుబులు రేపుతున్నాయి. పెట్టుబడులకు బంగారమే అనువైనదని భావించి.. అత్యధిక ధరల వద్ద కొనుగోళ్లు చేసిన వారిప్పుడు డోలాయమానంలో పడ్డారు. అసలు బంగారానికి ఏమైంది. కొనుగోలుదారులకు రానున్న రోజుల్లో పసిడి నమ్మకమైన పెట్టుబడిగా నిలుస్తుందా... లేదా...? అన్న అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.