ప్రతిధ్వని: చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..? - prathidwani on petrol hikes
పెట్రో మంటకు విరామమే కనిపించటం లేదు. బండి తీయాలంటేనే భయపడేలా.. పెట్రోల్ బంకు వైపు వెళ్లాలంటేనే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా ధరల వాతలు తేలుతున్నాయి. నిన్న ఉన్న ధర.. ఇవాళ ఉండటం లేదు. ఎందుకు పెరుగుతున్నాయో తెలీదు. పెరిగీ.. పెరిగీ... ఎక్కడ ఆగుతాయో తెలీదు. చమురు ధరల్లో అసలు ఎందుకీ పెరుగుదల..? ఇందులో కేంద్ర, రాష్ట్రాల్లో ఎవరి బాధ్యత ఎంత? ప్రధాని.. గత ప్రభుత్వం వైపు ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? ప్రజలు, విపక్షాలు ఎంత మొత్తుకుంటున్నా.. ప్రభుత్వాలు వారి గోడు ఎందుకు పట్టించుకోలేకపోతున్నాయి? మూల ధరల్ని మించిన స్థాయిలో సుంకాలు విధిస్తూ.. ప్రజలపై పన్నుల భారాన్ని అనుకుంటే తగ్గించలేరా? ఈ విషయాలపైనే ప్రతిధ్వని చర్చను చేపట్టింది.