Prathidhwani: చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో మన ప్రభుత్వాలు ఎక్కడ ? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ
చరిత్ర అంటే రాజులు, యుద్ధాల చిట్టానే కాదు. అంతకు మించిన ఎంతో ఘనమైన వారసత్వ ఆనవాళ్లు, నాగరికతల చిహ్నాలూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం.. వాటి ఔన్నత్యం గుర్తించడంలోనే వర్తమానం గొప్పతనం ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఆ శతాబ్దాల సుసంపదను కాపాడుకోవడంలో, గుర్తింపు కోసం కృషి చేయడంలో ఎక్కడో వెనుకబాటు.. తడబాట్లు. వాటిని అన్నింటినీ దాటుకుంటూ... రామప్ప రూపంలో.. తొలిసారిగా తెలుగునేల నుంచి ఒక చారిత్రక కట్టడం యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే.. చారిత్రక మూలాలు.., ఆ ఆనవాళ్లు కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.