రాష్ట్రంలో ఆస్తి పన్ను మోత.. ప్రజలపై ఎంతమేర భారం..? - ఏపీ వార్తలు
property tax hike in andhra pradesh: రాష్ట్రంలో ఆస్తి పన్ను మోత మొదలైంది. పెంచుడు పథకంలో మరో అడుగు ముందుకు వేసింది ప్రభుత్వం. ప్రజాసంఘాలు.., ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా.., ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్పినా... పట్టణ, నగర ప్రాంతాల్లో కొత్త విధానం ప్రకారం ఆస్తి పన్ను, భారం తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ ఆధారిత విలువ ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల భవిష్యత్‌లోనూ మరింత నడ్డి విరగడం ఖాయం అంటున్నారు... పౌరసమాఖ్యల ప్రతినిధులు. కరోనా వేళ అసలు ఏమిటీ పన్నుల బాధ? కొత్త ఆస్తిపన్నుతో ప్రజలపై ఎంత మేర భారం పడనుంది? అభ్యంతరాల్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో... ఎవరికి చెప్పుకోవాలి.. ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.