ప్రతిధ్వని : ఆర్బీఐ సిఫార్సులతో ప్రైవేటు బ్యాంకింగ్ రూపురేఖలు మారనున్నాయా?
ప్రైవేటు బ్యాంకుల్లోకి కార్పొరేట్లు అడుగుపెట్టేందుకు వీలుగా ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం పలు కీలక సిఫార్సులు చేసింది. ప్రైవేటు బ్యాంకుల్ని ప్రమోట్ చేయడానికి భారీ కార్పొరేటు సంస్థలు అలాగే పారిశ్రామిక సంస్థల్ని అనుమతించాలని సూచించింది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితిని 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలని పేర్కొంది. పదేళ్ల పాటు మెరుగ్గా కార్యకలాపాలు నిర్వహించిన బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు బ్యాంకులుగా మారడానికి అవకాశం కల్పించాలంది. కొత్త బ్యాంకుల మూలధన పరిమితిని పెంచాలని చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా సిఫార్సులు అమలైతే ప్రైవేటు బ్యాంకింగ్ రూపురేఖలు ఏవిధంగా మారే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Nov 23, 2020, 9:26 PM IST