ప్రతిధ్వని: పోషకాహారం... ఆరోగ్యం!
దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను ఆహార భద్రతతో అనుసంధానం చేయడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చని.. నాబార్డు నివేదిక వెల్లడించింది. ఈ అనుసంధానం లేకపోవడం వల్లనే పేదలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు.. పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ సమస్యను అధిగమించాలంటే పోషకాహారం పెరిగేలా వ్యవసాయ విధానాలు ఉండాలి. వివిధ పథకాల ద్వారా వైవిధ్యమైన పోషకాహారం ప్రజలకు అందించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తృణధాన్యాలను పంపిణీ చేయాలి. ప్రజలు తమకు ఇష్టమైన ఆహారాన్ని కొనుక్కొనేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థల ద్వారా విడతల వారీగా నగదు బదిలీ చేయాలి. బాలికలకు పాఠశాల విద్యలో పోషకాహార కార్యక్రమాలను అమలుచేయాలి. ఇలాంటి సిఫార్సులను నాబార్డు నివేదిక సూచించింది. ఈ నేపథ్యంలో పౌష్టికాహారానికి సంబంధించిన నాబార్డు నివేదికపై ప్రతిధ్వని చర్చ.