ప్రతిధ్వని: భారత్లో వైద్యరంగం స్థితిగతులు ఎలా ఉన్నాయి? - భారత్లో వైద్యరంగం పరిస్థతి న్యూస్
ప్రస్తుతం కొవిడ్ సంక్షోభం వైద్యవ్యవస్థ లోటుపాట్లను కళ్ల ముందుకు తెచ్చింది. పరిస్థితి తీవ్రంగా మారుతుంది.. అదుపుచేయలేమన్న అనుమానాల్ని నిజం చేస్తూ కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే.. దేశం నిస్సహాయ స్థితిలో పడింది. దేవుడిపైనే భారం వేసి బిక్కుబిక్కుమని రోజులు వెళ్లదీయాల్సి వస్తోంది. అసలు దేశం ఎందుకీ దుస్థితి ఎదుర్కొంటోంది? ప్రపంచదేశాలతో పోల్చితే భారతదేశంలో వైద్యరంగం స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన ప్రజారోగ్య రంగాన్ని అత్యంత ప్రధానంగా వేధిస్తున్న సమస్యలేమిటి? వాటినెలా అధిగమించాలి? సామాన్యుడి ప్రాణాలకు భరోసా ఇచ్చేలా.. బ్రిటన్, జర్మనీ, అమెరికా వంటి దేశాల తరహాలో ఇక్కడా సమగ్ర వైద్య విధానం తీసుకు రావటం ఎలా? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది..
Last Updated : Apr 22, 2021, 10:50 PM IST