ప్రతిధ్వని: గ్యాస్ ధరల పెంపు, సమీక్షా విధానంలో మార్పులు - గ్యాస్ ధరలపై ప్రతిధ్వని చర్చ న్యూస్
అసలే ఆర్థిక మందగమనం... ఆపై కరోనా కష్టాలు. సామాన్య, మధ్యతరగతి వర్గాల జీవితాల్ని తలకిందులు చేసిన ఈ పరిస్థితుల్లోనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి పెరుగుతున్న ధరలు. వంట గ్యాస్ మంట పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరలు వంటింటి బడ్జెట్‌ను అదుపు తప్పేలా చేస్తున్నాయి. ఇంతలోనే గ్యాస్‌ధరల సమీక్ష వ్యవధిని వారాలు, రోజుల్లోకి మార్చనున్నారన్న సంకేతాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సగటుజీవి పరిస్థితి ఏమిటి? ధరల దరువు నుంచి వారికి ఉపశమనం ఎలా? అనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.