pratidwani: దేశంలో రైతు ఆత్మహత్యలు ఆగేదెన్నడు? - వ్యవసాయం
తొలకరి చినుకులతో మొదలయ్యే రైతు పొలం పని.. ఎండమావుల వెంట సాగే పరుగులా మారింది. భూమిలో విత్తనం వేసింది మొదలు.. మార్కెట్లో ధాన్యానికి గిట్టుబాటు ధర సాధించే వరకు ఎడతెగని సమస్యల సంక్షోభం అయ్యింది... రైతు జీవితం. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతన్న బతుకు ఎంతకూ మానని గాయంగా ఎందుకు మారింది? ఈ దేశంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయేది ఎప్పుడు? పంట పొలాల్లో సిరులు పండించే రైతుల ముఖాలపై.. సంతోషాల పంటలు పండేదెప్పుడు?... జాతీయ రైతు దినోత్సవం నేపథ్యంలో ఇవాళ్టి ప్రతిధ్వని.