ప్రతిధ్వని: కరోనా టీకా సామర్థ్యం.. పంపిణీ సన్నద్ధత - ప్రతిధ్వని వీడియోలు
దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తోన్న కరోనా టీకా వచ్చేసింది. భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. రెండు టీకాలకు అనుమతి లభించడం కొవిడ్-19పై మనదేశం సాగిస్తున్న పోరులో నిర్ణయాత్మమైన మలుపుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం మన దేశంలో త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు. కొవిడ్ టీకాను తొలివిడతలో ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా టీకాల సామర్థ్యం, పంపిణీ సన్నద్ధతపై ప్రతిధ్వని చర్చ.