ప్రతిధ్వని: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో గెలుపెవరిది? - ఈటీవీ ప్రతిధ్వని
నాలుగు రాష్ట్రాలు...., ఓ కేంద్ర పాలిత ప్రాంతం.... దేశంలో మరో కీలక ఎన్నికల సంరంభానికి నగారా మోగింది. పద్దెనమిదిన్నర కోట్ల మంది ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికలపై మినీసార్వత్రికంగా భారీ అంచనాలే నెలకొన్నాయి అప్పుడే. మరి.... జోరు మీదున్న భారతీయ జనతాపార్టీ రాజకీయ అశ్వమేధానికి... విపక్షాలు, ప్రాంతీయ శక్తుల అస్థిత్వ పోరాటానికి మధ్య నిలిచేది ఎవరు? గెలిచేది ఎవరు? స్థానిక రాజకీయాలను వేడెక్కించే బీజేపీ వ్యూహాలు ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలనిస్తాయి...? కేరళ, తమిళనాడుల్లో మారుతున్న రాజకీయ సమీకరణలు ఎవరికి లాభిస్తాయి ? పశ్చిమ్‌బంగ లో తృణమూల్, బీజేపీ పోరులో గెలుపెవరిది... అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.