ప్రతిధ్వని: శతాధిక కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటి..? - కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రతిధ్వని చర్చా కార్యక్రమం
దేశం మొత్తాన్ని ఏకఛత్రాపధిత్యంగా ఏలిన కాంగ్రెస్ కోటకు బీటలు వారుతున్నాయి. శతాధిక కాంగ్రెస్ పార్టీ మరోసారి గొప్ప సంకటంలో పడింది. అసమ్మతి గళాల వాడీవేడీ పెరుగుతోంది. ఆ పార్టీకి ఇలాంటి ఒడుదొడుకులు కొత్త కాకపోవచ్చు. గాంధీ, నెహ్రూ, ఇందిరాల హయాంలోనూ ఎన్నో గడ్డుపరిస్థితులు దాటి వచ్చారు. కానీ ఇప్పటి పరిస్థితి అంతకు మించినట్లు మారడానికి ఎన్నో కారణాలు. దేశ రాజకీయ ముఖచిత్రంలో క్రమంగా వారి ముద్ర చెరిగి పోతోంది. అన్నింటినీ చక్కదిద్దాల్సిన అధినాయకత్వంలోనే నడిపించే నాయకుడెవరు అన్న గందరగోళంపై ఎంతకీ ఓ స్పష్టత రావటం లేదు. ఇలాంటి కష్టకాలంలో.. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అస్త్రంగా మలిచి, కాషాయ తలపాగాలతో కవ్విస్తున్నారు అసంతృప్త వాదులు. మరో కొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ అసలు కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏమిటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.